నేడు కందుకూరి వీరేశలింగం జయంతి

ఆంధ్ర సమాజ పితామహుడు కందుకూరి.

Update: 2024-04-16 02:34 GMT

దిశ, ఫీచర్స్ : బాల్య వివాహాల నిర్మూలన కోసం ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త. మూఢనమ్మకాలపై యుద్ధం ప్రకటించిన కలియుగ యోధుడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయన 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు. బ్రిటిష్ పాలనలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. దీనికి నిరసనగా ఆయన పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం చేపట్టారు. అనేక సామాజిక సంస్కరణల్లో కూడా పాలుపంచుకున్నారు. సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు శక్తివంచన లేకుండా ఆయన కృషి చేశారు.

సామాజిక కార్యకర్తగా, రచయితగా వీరేశలింగానికి అనేక లక్షణాలు ఉన్నాయి. ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడు కందుకూరి. బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడుతూనే వితంతు వివాహాలకు పిలుపునిచ్చారు. దేశంలో మొట్ట మొదటి వితంతువు వివాహం ఆయనే జరిపించారు. నేడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 

Tags:    

Similar News