కార్లతో గుద్దుకొని కత్తులతో పొడుచుకున్నారు.. సినిమాను తలపించేలా గ్యాంగ్ వార్!.. (వీడియో వైరల్)

సినిమాలో ఫైట్ సీన్ ను తలపించేలా అర్ధరాత్రి రెండు ముఠాలు గ్యాంగ్ వార్ చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది.

Update: 2024-05-25 09:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సినిమాలో ఫైట్ సీన్ ను తలపించేలా అర్ధరాత్రి రెండు ముఠాలు గ్యాంగ్ వార్ చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. ఉడిపి సమీపంలోని కుంజిబెట్టులో మే 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో రెండు ముఠాలు అర్ధరాత్రి మణిపాల్ జాతీయ రహదారిపై విచక్షణారహితంగా దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో రెండు గ్యాంగులు కార్లతో గుద్దుకున్నారు. అనంతరం ఒక కారులోని వ్యక్తులు కత్తులతో దాడి చేసేందుకు దిగగా.. మరో కారులోని వ్యక్తులు వారిని కారుతో గుద్ది దాడి చేశారు. ఇందులో ఇరువురు ముఠాలకు చెందిన వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి దూరం నుంచి చీత్రికరించాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉడిపి సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి జూన్ 1 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విదించారు.

Similar News