సైనీ సర్కారుకు ప్రమాదమేమీ లేదు..మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్

హర్యానాలో ముగ్గురు స్వత్రంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు.

Update: 2024-05-08 07:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో ముగ్గురు స్వత్రంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. సైనీ సర్కారుకు ప్రమాదమేమీ లేదని స్పష్టం చేశారు. తమతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. బుధవారం ఆయన కర్నాల్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల సీజన్‌లో ఎవరు ఎక్కడికి వెళ్లినా ప్రభావం ఉండదు. పలువురు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుత ఎన్నికలపై ఏ మాత్రం ఇంపాక్ట్ చూపబోదని స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. కాగా, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు సైనీ సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ అవిశ్వాసానికి మద్దతు తెలుపుతారని స్పష్టం చేశారు. నయాబ్ సింగ్ సైనీ అత్యంత బలహీనమైన సీఎంగా అభివర్ణించారు. 

Tags:    

Similar News