మొన్న పాపడ్ నేడు ఎగ్.. ఎడారి ఇసుకలో జవాన్ల కుకింగ్!

రాజస్థాన్ ఎడారిలో మొన్న ఓ బీఎస్ఎఫ్ జవాన్ పాపడ్ కుక్ చేయగా.. అదే ఎడారిలో ఇవ్వాళ మరో జవాన్ కోడిగుడ్డు ఉడకబెట్టాడు.

Update: 2024-05-24 13:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్ ఎడారిలో మొన్న ఓ బీఎస్ఎఫ్ జవాన్ పాపడ్ కుక్ చేయగా.. అదే ఎడారిలో ఇవ్వాళ మరో జవాన్ కోడిగుడ్డు ఉడకబెట్టాడు. ఎడారి ఇసుకలో జవాన్ల కుకింగ్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. రాజస్థాన్ లోని బికనీర్ ఎడారిలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ బార్డర్ లో బీఎస్ఎఫ్ విభాగానికి చెందిన సైనికులు 48.8 డిగ్రీల ఎండలో పెట్రోలింగ్ చేస్తూ గస్తీ కాస్తున్నారు. వీరిలో ఓ జవాన్ కోడిగుడ్డును ఇసుకలో కొద్దిసేపు ఉంచి తీశాడు. అనంతరం దాని పొట్టు ఒలిచి చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడిగుడ్డు పూర్తిగా ఉడికి తినడానికి రెడీగా ఉంది. ఆ జవాన్ కోడిగుడ్డు పొట్టు మొత్తంగా ఒలిచి తిన్నాడు.

దీనికి సంబందించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. అంత ఎండలో డ్యూటీ ఎలా చేస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్ సార్ అని ఓ నెటిజన్ అనగా.. పొనీలే వంట గ్యాస్ బాధ తప్పిందని మరో నెటిజన్ చమత్కారంగా కామెంట్ చేశాడు. ఈ మండే ఎండలపై ఓ అధికారి మాట్లాడుతూ.. రాజస్తాన్ ఎడారిలోని సరిహద్దు వెంట వేడి గాలులతో కూడిన ఎండలు ఉన్నాయని, ప్రస్తుతం ఉష్ణోగ్రత 46 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉందని, అయినప్పటికీ మా సైనికులు నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. ఎండ దెబ్బ నుంచి రక్షించేందుకు వారికి నిమ్మరసం లాంటి ద్రవపదార్ధాలు అందజేస్తున్నామని తెలియజేశారు.

Similar News