ప్రధాని మోడీ పై అనర్హత వేటు పిటిషన్.. షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

2024 పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది.

Update: 2024-04-29 09:58 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ పై అనర్హత వేటు వేయాలని పలువురు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ రోజు ఢిల్లీ హైకోర్టు.. సదరు పిటిషన్ ను కొట్టివేసింది. ప్రధాని మోడీ ఈ ఎన్నికల్లో దేవుళ్లు, పుణ్యక్షేత్రాల పేర్లతో ఓట్లు అడుగుతున్నారని.. ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. కాగా ఈ పిటిషన్ కొట్టి వేసింది. అలాగే.. సదరు పిటిషన్ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని.. ఈ విషయం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది. దీంతో మోడీపై ఆరు సంవత్సరాల పాటు అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసిన వారికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని.. బీజేపీ నేతలు అంటున్నారు.

Similar News