మోసాల గురించి వినియోగదారులకు అవగాహన కోసం పాడ్‌క్యాస్ట్‌

మోసాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్తగా పాడ్‌క్యాస్ట్‌ను ప్రారంభించనుంది.

Update: 2024-05-08 13:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మోసాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్తగా పాడ్‌క్యాస్ట్‌ను ప్రారంభించనుంది. ప్రతి వినియోగదారునికి చేరుకుని వారి హక్కులు తెలుసుకోవడానికి, అలాగే వారు మోసాలను ఎదుర్కోవడానికి ఉన్న మార్గాల పట్ల అవగాహన కల్పించడం దీని విధి. ప్రారంభంలో, పాడ్‌క్యాస్ట్‌ ప్రతి ఆదివారం Facebook, Instagram, Twitter, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయబడుతుందని సమాచారం. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) మోస పోయిన బాధితుల అనుభవాలను, వారి సమస్యల పరిష్కారాన్ని వివరించడానికి పాడ్‌క్యాస్ట్ కోసం స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్‌ను ఉపయోగిస్తుంది.

కన్స్యూమర్ వాయిస్ సీఈఓ అషిమ్ సన్యాల్ మాట్లాడుతూ, ఇది చాలా అవసరమైన చొరవ. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ఎల్లప్పుడూ స్వాగతించబడుతుంది. పాడ్‌క్యాస్ట్‌ లాంచ్ ద్వారా వినియోగదారుల ప్రయోజనాల కోసం చురుగ్గా పని చేస్తున్నందుకు మంత్రిత్వ శాఖ అధికారులను తప్పక అభినందించాలని అన్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుమానస్పద రోబో కాల్‌లు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా తప్పుడు ప్రకటనలు, వస్తువుల కొనుగోలుకు సంబంధించిన మోసాలు తదితర గురించి అవగాహన కల్పించనున్నారు.

Similar News