Indian Army: విపత్కర పరిస్థితుల నడుమ గర్భిణీ ప్రాణం నిలబెట్టిన ఆర్మీ..

సరిహద్దు రక్షణే కాదు దేశ ప్రజల సంరక్షణ కూడ తమ బాధ్యతే అని అంటోంది భారత సైన్యం.

Update: 2024-05-07 06:55 GMT

దిశ వెబ్ డెస్క్: సరిహద్దు రక్షణే కాదు దేశ ప్రజల సంరక్షణ కూడ తమ బాధ్యతే అని అంటోంది భారత సైన్యం. ఎక్కడ ఎవరు ఆపధలో ఉన్నారని తెలిసినా అరక్షణం కూడ ఆలోచించకుడా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పరుగులు తీసే ఆర్మీ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఓ గర్భిణి ప్రాణాలను కాపాడింది.

వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్ లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉన్న మారుమూల పల్లెలో ఓ గర్భిణి ఆరోగ్యం విషమించింది. అయితే ఆ మారుమూల పల్లెలో వైద్య సధుపాయం అందుబాటులో లేదు. ఆనుపత్రి అందుబాటులో ఉన్న ప్రాంతానికి తరలించాలి అని స్థానికులు అనుకున్నారు. అయితే స్థానికంగా భారీగా మంచు కురవడంతో రహదారులన్నీ మూసుకుపోయి ఎటు కదలలేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఆ మహిళ ధుస్థితి గురించి తెలుసుకున్న గుగల్దార్ బెటాలియన్ వెంటనే రంగంలోకి దిగింది. ఆ మహిళకు ముందుగా జుమాగుండ్లోని ఆర్మీ యూనిట్ నర్సింగ్ అసిస్టెంట్, పీకే గలిలోని బెటాలియన్ వైద్యాధికారి ప్రథమ చికిత్స అందించారు. ఆ తరువాత ఆమెను స్ట్రైచర్పై గ్రామస్థుల సాయంతో కాలినడకన ఇతర ప్రాంతానికి సురక్షితంగా తరలించారు.

విపత్కర వాతావరణ పరిస్థితులను ఎదిరించి భారత సైన్యం గర్భిణి ప్రాణాలను కాపాడారు. దీనితో ప్రజల నమ్మకాన్ని మరోసారి ఆర్మీ నిలబెట్టుకుంది అని స్థానికులు భారత సైనికులను కొనియాడారు. గర్భిణి ప్రాణాలను కాపాడిన ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు.  

Similar News