ఇండియా కూటమి గెలిస్తే ఆ స్కీమ్ రద్దు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్ని వీర్ స్కీమ్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఎందుకంటే దీనిని సైన్యం ప్రారంభించలేదని, ప్రధాని మోడీ సృష్టించారని ఎద్దేవా చేశారు.

Update: 2024-05-07 13:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్ని వీర్ స్కీమ్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఎందుకంటే దీనిని సైన్యం ప్రారంభించలేదని, ప్రధాని మోడీ సృష్టించారని ఎద్దేవా చేశారు. అంతేగాక జీఎస్టీని సైనం సవరిస్తామని తెలిపారు. జార్ఖండ్‌లోని గుమ్లాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. దేశం కోసం త్యాగం చేసే ఎవరికైనా అమరవీరుల హోదా కల్పించాలని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఐదు పన్ను శ్లాబులతో తప్పుడు జీఎస్టీ పథకాలను అమలు చేస్తోందని విమర్శించారు. ఇండియా అధికారంలోకి రాగానే దానిని సవరిస్తామని చెప్పారు.

ఆదివాసీలకు సైతం బీజేపీ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అయోధ్య రామమందిరం, కొత్త పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపించారు. ముర్ము గిరిజన బిడ్డ అయినందుకే ఇన్వైట్ చేయలేదని వెల్లడించారు. గిరిజనులు అభివృద్ధి చెందడం బీజేపీకి ఇష్టం లేదని తెలిపారు. రైల్వేలు తదితర సంస్థలను పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు.   

Tags:    

Similar News