స్వాతి మలివాల్ దాడి కేసు.. బిభవ్ కు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ

స్వాతి మలివాల్ దాడి కేసులో నిందితుడికి నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు.

Update: 2024-05-24 12:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతి మలివాల్ దాడి కేసులో నిందితుడికి నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ప్రాసిక్యూషన్ చేసిన విజ్ఞప్తిని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ అంగీకరించారు. దీంతో బిభవ్ ను రిమాండ్ కు తరలించారు. మే 12న సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతిమలివాల్‌పై దాడి చేశాడు. తనపై దాడి జరిగిందని మే 13న స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడు బిభవ్ కుమార్‌ని మే18న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆయన పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.

స్వాతిపై దాడి కేసులో భాగంగా.. కేజ్రీవాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్‌ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మరోవైపు ఘటన జరిగిన తర్వాత బిభవ్ కుమార్ తన ఫోన్‌ని ఫార్మాట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని కూడా పోలీసులు ఫోరెన్సిక్ విచారణకు పంపారు. మొత్తం 8 సీసీటీవీ కెమెరాల్లోని గంటల తరబడి ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Similar News