తల్లిపాలను విక్రయించడం తక్షణం ఆపేయాలి: ఎఫ్ఎస్ఎస్ఏఐ

లేకుంటే బాధితులపై కఠిన చర్యలు తప్పవని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది.

Update: 2024-05-26 10:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తల్లిపాలు, తల్లిపాల విక్రయాలకు దేశంలో ఎటువంటి అనుమతులు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెల్లడించింది. తమ నియమాలు వాటి ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతించదని స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ 2006 చట్టంలోని నిబంధనల ప్రకారం, తల్లిపాల ప్రాసెసింగ్, విక్రయాలకు అనుమతులు లేవని, తల్లిపాల కమర్షియల్ వినియోగాన్ని, విక్రయాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను తక్షణం ఆపేయాలని..లేకుంటే బాధితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దేశంలో ఆహార పదార్థాల తయారీ విక్రయాలను నియంత్రించే ఎఫ్ఎస్ఎస్ఏఐ తల్లిపాల ప్రాసెసింగ్, విక్రయ కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారులకు లైసెన్స్ ఇవ్వొద్దని రాష్ట్ర, కేంద్ర లైసెన్సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాతల నుంచి సేకరించిన తల్లిపాలు వాణిజ్య అవసరాల కోసం కాదని, చనుబాల నిర్వహణ కేంద్రాలతో కూడిన ఆరోగ్య సౌకర్యాల్లో చేరిన శిశువులకు మాత్రమే అందాలని పేర్కొంది. కాగా, తల్లిపాలను దాత ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా ఉచితంగా, స్వచ్ఛందంగా దాని చేయాలి. సేకరించిన పాలను ఆసుపత్రిలో ఉండే పసికందులకు అందించాలని ప్రభుత్వం నిబంధనలు చెబుతున్నాయి.  

Tags:    

Similar News