250 మందితో చెన్నైకి స్పెషల్ ట్రైన్ (వీడియో)

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో క్షేమంగా బయటపడిన 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నై తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Update: 2023-06-03 14:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో క్షేమంగా బయటపడిన 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నై తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు నెంబర్‌ P/13671 భద్రక్‌ స్టేషన్ నుంచి బయల్దేరి.. బహనాగలో ప్రయాణికులను ఎక్కించుకోనుంది. ఆ తర్వాత ఇవాళ రాత్రి 9.30కి విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అక్కడ 9 మంది ప్రయాణికులు దిగుతారని చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం..బ్రహ్మపురలో నలుగురు ప్రయాణికులు దిగగా.. 41 మంది విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో ఒకరు, తాడేపల్లిగూడెంలో ఇద్దరు, చెన్నైలో 133 మంది ప్రయాణికులు దిగుతారని దక్షిణ మధ్య రైల్వే డివిజినల్‌ అధికారి తెలిపారు. ఆదివారం ఉదయానికి ఈ రైలు చెన్నై చేరుకుంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ఒడిశా ఘటనపై పాకిస్తాన్ ప్రధాని సహా ప్రపంచ నేతల సంతాపం  

రైలు ప్రమాదానికి కారణమైన వారిని క్షమించం: ప్రధాని మోడీ  

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News