తండ్రి అంత్యక్రియల కోసం కోర్టుకెక్కిన కొడుకు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

ఆధునిక సమాజంలో ఉంటూ ఆదిమానవుల్లా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మనుషులు.

Update: 2024-05-02 10:27 GMT

దిశ వెబ్ డెస్క్: ఆధునిక సమాజంలో ఉంటూ ఆదిమానవుల్లా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మనుషులు. రాకెట్ల యుగంలో కూడా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మూఢాచారాలతో మనుషులం అనే సంగతే మర్చిపోతున్నారు కొంతమంది ప్రజలు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ మానవత్వం మచ్చుకైనా లేదు అని చెప్పడానికి, కన్న తండ్రికి అంత్యక్రియల చేయడం కోసం కోర్టును అశ్రయించాల్సిన ధుస్తితి ఏర్పడడమే నిదర్శనం.

ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గడ్‌లోని చింద్‌బాహార్ జిల్లా దార్భా గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం క్రైస్తవంలోకి మారారు. అయితే ఇటీవల ఈశ్వర్ అనారోగ్యంతో జగదల్‌పుర్ ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో చేరారు. ఈ క్రమంలో చికిత్సపొందుతున్న ఈశ్వర్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం మృతి చెందారు.

దీనితో ఈశ్వర్‌ కుమారుడు సార్తిక్ తన తండ్రి అంత్యక్రియలను స్వగ్రామంలో చెయ్యాలి అని అనుకున్నారు. అయితే అందుకు కొందరు గ్రామస్తులు, హిందూ సంఘాలు అడ్డుచెప్పడంతో సార్తిక్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సార్తిక్ ధాఖలు చేసిన పిటీషన్‌పై శనివారం విచారణ జరిపిన కొన్నేళ్ళ కిందట ఈశ్వర్ ఆయన చనిపోయాకా గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరపడాన్ని వ్యతిరేకించాయి.

కోర్టు ఈశ్వర్ అంత్యక్రియలు స్వగ్రామంలో చేసేందుకు తగిన భద్రత కల్పించాల్సిందిగా జిల్లా సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సార్తిక్ మాట్లాడుతూ.. తన తండ్రి అంత్యక్రియలకు గ్రామంలో నిరసన వ్యక్తమవుతుండటంతో..తాను హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.కాగా తన తండ్రి భౌతికకాయాన్ని గ్రామంలోనే సమాధి చేయడానికి కోర్టు నుంచి అనుమతి ఇచ్చిందని, దీనితో తమ పూర్వీకుల స్థలంలో తన తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించాం అని పేర్కొన్నారు. 

Similar News