మహారాష్ట్రలో ఎంఐఎం నేతపై కాల్పులు.. అసదుద్దీన్ స్పందన ఇదే?

మహారాష్ట్రలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై దుండగులు కాల్పులకు తెగపడ్డారు. నాసిక్ జిల్లాలోని పెట్రోల్ పంపు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు మాలెగావ్ పోలీసులు తెలిపారు.

Update: 2024-05-27 09:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై దుండగులు కాల్పులకు తెగపడ్డారు. నాసిక్ జిల్లాలోని పెట్రోల్ పంపు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు మాలెగావ్ పోలీసులు తెలిపారు. మోటర్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మాలిక్‌ పై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు మాలిక్‌ను ఆస్పత్రికి తరలించారు. మాలిక్ ఛాతీ, కాలు, కుడి చేతిపై తీవ్రగాయాలయ్యాయి. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం అబ్దుల్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తో్ంది. ఈ ఘటనపై ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ కుట్ర పూరితంగానే దాడి చేశారని ఆరోపించారు. సీఎం ఏక్‌నాథ్ షిండే, పోలీసులు నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఎంఐఎం నాయకుడు అబ్దుల్ సలామ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అలాగే గతేడాది డిసెంబరులో సివాన్‌కు చెందిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడిని హత్య చేశారు. 

Tags:    

Similar News