మాజీ ప్రధాని మనవడి లైంగిక వేధింపుల కేసులో షాకింగ్ విషయాలు.. పెన్ డ్రైవ్‌లో 1000కి పైగా సెక్స్ వీడియోలు..!

మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Update: 2024-04-29 08:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రజ్వల్ రేవణ్ణ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ప్రజ్వల్ పెన్ డ్రైవ్‌లో 1000కి పైగా సెక్స్ వీడియోలను పోలీసులు గుర్తించారు. ఇక, ఇంట్లో వంట మనిషి ఫిర్యాదు ఆధారంగా జిల్లాలోని హోలెనరసిపూర్‌లో ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజ్వల్ దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Similar News