Big Breaking:వారి ఆధార్ కార్డులు సీజ్

కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌కు చెందిన 50 వేల మంది శరణార్థులు నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ తన రిపోర్టులో పేర్కొంది.

Update: 2024-05-08 11:50 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌కు చెందిన 50 వేల మంది శరణార్థులు నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ తన రిపోర్టులో పేర్కొంది. ఈ క్రమంలో విదేశీయులు అక్రమంగా కేరళలోకి చొరబడుతున్నట్లు 50 ఆధార్ కార్డులను తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగాల్, జార్ఖండ్ నుంచి ఐపీ అడ్రెస్‌లతో కేరళలో ఆధార్ కేంద్రాలను హ్యాక్ చేసి నకిలీ ఆధార్ కార్డులను సృష్టిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కేరళ పోలీసులు ఇవాళ వందల సంఖ్యలో నకిలీ ఆధార్ కార్డులను సీజ్ చేశారు. ఆధార్ చట్టం ప్రకారం నకిలీ కార్డు కలిగిన వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా లక్ష జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. దేశంలోకి అక్రమంగా రావడమే కాకుండా నకిలీ ఆధార్ సైతం తీసుకుంటున్నారని కేంద్రం దీన్ని సిరీయస్‌గా తీసుకోవాలని సూచిస్తుంది. 

Similar News