ప్రభుత్వ కార్యాలయంలో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు!

దేశంలోని రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే భారీ మొత్తంలో ప్రభుత్వ కార్యాలయం బేస్ మెంట్‌లో నోట్ల కట్టలు వెలుగు చూడటం కలకలం రేపింది.

Update: 2023-05-20 11:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే భారీ మొత్తంలో ప్రభుత్వ కార్యాలయం బేస్ మెంట్‌లో నోట్ల కట్టలు వెలుగు చూడటం కలకలం రేపింది. రాజస్థాన్‌లోని జైపూర్ నగర పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. యోజన భవన్‌లోని ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యాలయం బేస్ మెంట్‌లో రూ.2.31 కోట్ల క్లెయిమ్ చేయని నగదు, ఒక కిలో బంగారం కనుగొన్నట్లు జైపూర్ అడిషనల్ డైరెక్టర్ మహేష్ గుప్తా మీడియాకు వివరించారు.

ఐటీ డిపార్ట్ మెంట్ నిర్వహించిన సోదాల్లో వీటిని కనుగొన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ పాత వస్తువులు ఉంచారని చాలా కాలంగా ఆ వస్తువులు ఇక్కడే ఉన్నాయని ఈ ఘటనపై 102 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశామని, వాటిలో ఈ డబ్బును ఎవరు దాచారు అనేది దర్యాప్తులో తేల్చుతామని మహేశ్ గుప్తా చెప్పారు. ఈ వ్యవహారంపై సీఎం అశోక్ గెహ్లోట్‌కు కూడా సమాచారం అందించినట్లు తెలిపారు.

Tags:    

Similar News