రోహిత్ వేముల ఇష్యూ.. ఎన్నికల వేళ ఇరకాటంలో రాహుల్ గాంధీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016 రోహిత్ వేముల అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. దళిత విద్యార్థి ఆత్మహత్యకు ఓ సంఘమే కారణం అంటూ.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Update: 2024-05-04 04:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016 రోహిత్ వేముల అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. దళిత విద్యార్థి ఆత్మహత్యకు ఓ సంఘమే కారణం అంటూ.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో తెలంగాణ పోలీసులు సంచలనంగా ముగించారు. దేశవ్యాప్తంగా వివాదంగా మారిన రోహిత్ వేముల అస్సలు ఎస్సీ కాదని.. తెలంగాణ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన రిపోర్టులో తెలిపారు. అతను ఫేక్ ఎస్సీ సర్టిఫికెట్‌తో సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడని.. ఈ విషయం బయటకు వస్తే.. తాను పూర్తి చేసిన డిగ్రీలు మొత్తం కోల్పోవడంతో పాటు.. శిక్ష పడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చిని పోలీసుల రిపొర్డులో తెలిపారు. అలాగే అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. ఇన్ని రోజులు నిందితులుగా అనుమానించిన వారందరికీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.

దీంతో పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. రోహిత్ వేముల దళితుడు కాబట్టి ఆత్మహత్య చేసుకునేలా కొంతమంది చెశారని.. రాహుల్ పార్లమెంట్ సాక్షిగా చర్చకు పట్టుబట్టాడు. అలాగే అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పాటుగా అనేక సమావేశాల్లోనే రోహిత్ వేముల ఇష్యూను రాహుల్ గాంధీ లేవనెత్తాడు. అయితే తాజా పరిణామాలతో రాహుల్ గాంధీని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ వేముల ఎస్సీ నే కాదని పోలీసుల రిపొర్టుతో.. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని, కులం ఆధారంగా చేసుకుని రాహుల్ రాజకీయాలు చేస్తున్నరనేదానికి ఇదే నిదర్శనం అని సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News