పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్.. మైనర్ బాలుడి తాత అరెస్ట్

మహారాష్ట్రలోని పూణేలో మైనర్ బాలుడు లగ్జరీ కారును నడిపి ఇద్దరి ప్రాణాలు తీసిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-05-25 12:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని పూణేలో మైనర్ బాలుడు లగ్జరీ కారును నడిపి ఇద్దరి ప్రాణాలు తీసిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సదరు బాలుడి తాతను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నేరాన్ని తమ ఫ్యామిలీ డ్రైవరు గంగారాంపై మోపేందుకు బాలుడి కుటుంబ సభ్యులు విఫల యత్నం చేశారని పోలీసులు వెల్లడించారు. బాలుడి తాత సురేంద్ర అగర్వాల్‌ను శనివారం కోర్టులో హాజరుపరిచారు. మే 28 వరకు ఆయన్ని స్థానిక కోర్టు కస్టడీకి పంపింది. అంతకుముందు అతడి నివాసంలో పూణే క్రైం బ్రాంచ్ అధికారులు సోదాలు చేశారు. ఈ ప్రమాదం జరిగిన టైంలో తాను కారులో లేనని.. బాలుడే కారును నడిపాడని డ్రైవర్ గంగారాం ఇప్పటికే వెల్లడించాడు. ఈ యాక్సిడెంట్‌ చేసినట్టు ఒప్పుకొని, పోలీసుల ఎదుట లొంగిపోవాలని బాలుడి తాత తనను బెదిరించాడని ఆరోపించాడు. నేరం ఒప్పుకోవాలంటూ తనను ఇంట్లో నిర్బంధించారంటూ డ్రైవర్ గంగారాం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాలుడి తాతను అరెస్టు చేశారు.

Similar News