ఢిల్లీలో ఉగ్రదాడికి పాల్పడతాం.. ఖలిస్తాన్ గ్రూపు బెదిరింపులు

గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దేశ రాజధానిలో ఉగ్రదాడి బెదిరింపులు కలకలం రేపాయి.

Update: 2023-01-21 14:31 GMT

న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దేశ రాజధానిలో ఉగ్రదాడి బెదిరింపులు కలకలం రేపాయి. ఖలిస్తాన్ గ్రూపునకు చెందిన సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) సంస్థ ఉగ్రవాది గురుపత్వాంత్ సింగ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. పంజాబ్‌ను భారత్ ను విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో దేశరాజధానిలో దాడులకు పాల్పడుతామని బెదిరించారు.

'జనవరి 26న ఇంట్లోనే ఉండండి. లేనిచో మిమ్మల్ని ఎస్‌జేఎఫ్ అడ్డుకుంటుంది. ఢిల్లీ మా లక్ష్యంగా ఉంది. మేము ఖలిస్తాన్ జెండాను ఎగరేస్తాం' అని అన్నారు. అంతేకాకుండా ఎవరైనా ఖలిస్తాని జెండాను ఎర్రకోటపై ఎగురవేస్తే 5 లక్షల డాలర్లు ఇస్తామని అఫర్ చేశారు. అయితే ఈ బెదిరింపులపై లాయర్ వినీత్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతామని ఎస్‌జేఎఫ్ ప్రకటించడం షాక్‌కు గురి చేసిందని అన్నారు. అయితే ఇప్పటికే దేశరాజధానిలో అదనపు భద్రతా బలగాలను మోహరించి రక్షణను మరింత పటిష్టం చేశారు.

Tags:    

Similar News