ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోడీ

ఒడిశాలోని బాలాసోర్ లో ఘోరం రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని ప్రధాని మోడీ పరామర్శించారు.

Update: 2023-06-03 11:59 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలాసోర్ లో ఘోరం రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని ప్రధాని మోడీ పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆయనతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. అంతకు ముందు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లిన పీఎం.. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టును రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ ప్రధానికి అందజేశారు.

అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేలు అందించాలని ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంలో 278 మందికి పైగా చనిపోగా 1000 మంది వరకు గాయపడ్డారు. 

Also Read:   Coromandel express accident : రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోడీ

Similar News