గేమింగ్ జోన్‌లో ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ లో శనివారం మధ్యహ్నం టిఆర్‌పి గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Update: 2024-05-25 16:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ లో శనివారం మధ్యహ్నం టిఆర్‌పి గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. "రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నా ఆలోచనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితో ఉంటాయి. గాయపడిన వారి కోసం ప్రార్థనలు. బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోందని" రాసుకొచ్చారు. అలాగే మరోక ట్వీట్‌లో "రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం మనందరినీ కలిచివేసింది. కొద్దిసేపటి క్రితం గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ తో నేను మాట్లాడాను.

ఈ ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన బాధితులకు ప్రభుత్వం విధాలుగా సహాయం అందించడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి నాకు చెప్పారని ట్వీట్ చేశారు. కాగా రాజ్ కోట్‌లోని టిఆర్‌పి గేమింగ్ జోన్‌లో మధ్యాహ్నం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం వల్ల ఇప్పటి వరకు 24 మంది సజీవ దహనం అయ్యారు. కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో అత్యధికంగా 12 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. అలాగే మంటలు అదుపులోకి వస్తున్న క్రమంలో మృతదేహాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయని.. ప్రస్తుతానికి దొరికిన 24 మృతదేహాలతో పాటు మరికొంత మంది కూడా చనిపోయి ఉంటారని పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు.

Click Here For Twitter Post..

Similar News