అదిరిపోయే స్టెప్పులు వేసిన మోడీ.. స్వయంగా ట్వీట్ చేసిన ప్రధాని (వీడియో)

పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని మోడీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ షేర్ చేస్తున్నారు.

Update: 2024-05-07 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని మోడీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ షేర్ చేస్తున్నారు. ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న ప్రధాని టీవీ చానెల్స్‌కు ఇస్తున్న ఇంటర్వ్యూలను సైతం ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర భాషలోనే ట్వీట్ చేస్తూ ప్రజలు, నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ ట్విట్టర్‌లో మోడీ ఓ కాన్సెర్ట్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న యానిమేషన్ వీడియో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌ను ప్రధాని మోడీ రీ ట్వీట్ చేసి ఇలా స్పందించారు. ‘తాను డ్యాన్స్ చేయడాన్ని మీరంతా ఆస్వాదించినట్లుగానే నేను ఎంజాయ్ చేశా.. ఎన్నికల వేడి పీక్స్‌కు చేరిన ఈ సమయంలో వీడియో చేసిన వారి క్రియేటివిటీ నన్ను మరింత ఉత్సాహపరిచిందని మోడీ ట్వీట్ చేశారు. దీనికి ‘పోల్ హ్యూమర్’ అనే ట్యాగ్‌ను మోడీ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

   Click Here For Twitter Post

Similar News