రేపు ఏడు రాష్ట్రాల్లో పోలింగ్.. మొత్తం ఎన్ని ఎంపీ స్థానాలకు అంటే..?

లోక్‌సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఐదు విడతల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-24 02:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఐదు విడతల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కాగా రేపు ఏడు రాష్ట్రాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన 5 విడతల్లో 428 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. జూన్ 1న సార్వత్రిక ఎన్నికల ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కాగా, మోడీ మానియాపై బీజేపీ ఆధారపడగా.. కాంగ్రెస్ బీజేపీపై వ్యతిరేకత తమను గట్టెక్కిస్తాయని భావిస్తున్నాయి. అయితే రెండు ప్రధాన పార్టీల భవితవ్యం జూన్ 4న తేలనుంది. 

Read More..

లోక్‌సభ ఎన్నికలలో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు

Similar News