సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ ప్రారంభం అయింది.

Update: 2024-05-25 02:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఐదు విడతల్లో 428 స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. ఆరో విడతలో 58 ఎంపీ స్థానాలకు బరిలో 889 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆరు విడతలో 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. హరియాణాలో 10, ఢిల్లీలో 7, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. బీహార్‌లో 8, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 4 లోకసభ స్థానాలతో పాటు ఒడిశాలో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. జూన్ 1న ఏడో విడతలో 8 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న లోక్ సభ, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

Similar News