ప్రజలు ఓట్లతోనే బీజేపీకి సమాధానం చెబుతారు: సునీతా కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు ప్రజలు ఓటు ద్వారానే సమాధానం చెబుతారని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్‌ను నియంత్రించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలకు తీవ్రంగా ప్రతి స్పందిస్తామని తెలిపారు.

Update: 2024-05-02 09:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు ప్రజలు ఓటు ద్వారానే సమాధానం చెబుతారని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్‌ను నియంత్రించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలకు తీవ్రంగా ప్రతి స్పందిస్తామని తెలిపారు. గుజరాత్‌లోని భరూచ్, భావ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార ర్యాలీలకు వెళ్లే ముందు ఆమె అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్‌ని ఎన్నికల టైంలో బలవంతంగా జైలులో పెట్టారు. దీంతో కేజ్రీవాల్ వాయిస్ ప్రజలకు చేరకుండా చేశారు. కానీ ప్రజలు చాలా తెలివైనవారు తమ ఓట్లతో తగిన సమాధానం చెబుతారు’ అని వ్యాఖ్యానించారు. ఆప్ అభ్యర్థులు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.

ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ..మతం పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు అనుమతించబోమని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎన్నికల ముందు ఈ విషయాన్నీ ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. దేశంలో మీరు చేసిన మంచి పనులను చూసి ఎందుకు ఓట్లు అడగడం లేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి పాకిస్థాన్‌కు మంచి మిత్రుడని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నారని త్వరలోనే అన్నింటికీ సమాధానం చెబుతారని చెప్పారు. అధికార పార్టీ దేశాన్ని, సమాజాన్ని విభజించి రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. కాగా, గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లకు గాను ఆప్ రెండు స్థానాల్లో బరిలో నిలిచింది. 

Tags:    

Similar News