టిక్ టాక్ బాన్‌ను నిరోధించాలని మాతృ సంస్థ దావా!

టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ అమెరికా చేసిన చట్టాన్ని నిరోధించాలని దాని మాతృసంస్థ అయినా చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ అమెరికా ఫెడరల్ కోర్టులో దావా వేసింది.

Update: 2024-05-15 06:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ అమెరికా చేసిన చట్టాన్ని నిరోధించాలని దాని మాతృసంస్థ అయినా చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ అమెరికా ఫెడరల్ కోర్టులో దావా వేసింది. అమెరికాలో 170 మిలియన్ల మంది ఉపయోగించే షార్ట్ వీడియో యాప్ ను బలవంతంగా ఉపసంహరించుకునేలా ప్రెసిడెంట్ జో బిడెన్ సంతకం చేసిన చట్టాన్ని నిరోధించాలని కోరుతూ దావాలో పేర్కొంది. ఈ చట్టం యూఎస్ రాజ్యాంగాన్ని, వాక్ స్వేచ్ఛా రక్షణల మొదటి సవరణ ఉల్లంఘన సహా అనేక కారణాలను పేర్కొంటూ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో కంపెనీలు తమ దావాను దాఖలు చేశాయి. కాగా చైనా అమెరికన్ల డేటాను యాక్సెస్ చేయగలదని, ఇలాంటి యాప్‌తో వారిపై గూఢచర్యం చేయవచ్చనే యూఎస్ చట్టసభ సభ్యులలో ఆందోళన కారణంగా, ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది వారాల తర్వాత కాంగ్రెస్‌లో మెజారిటీ సభ్యులు దీన్ని ఆమోదించారు. దీంతో యూఎస్ భద్రతా కారణాల దృష్యా టిక్ టాక్ ని విక్రయించడానికి, నిషేదాన్ని ఎదుర్కొవడానికి జనవరి 19, 2025 వరకు గడువు ఇచ్చింది. ఇవే కారణాలతో నిషేదాన్ని మరో మూడు నెలలు పొడగించుకునేలా అమెరికా చట్టం చేసింది.

Similar News