పరాస్ రాజీనామా ఆమోదం: కిరణ్ రిజిజుకు అదనపు బాధ్యతలు

బిహార్‌లో సీట్ షేరింగ్ పై విభేదాలు రావడంతో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖా మంత్రి పశుపతి పరాస్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-03-20 06:32 GMT

 దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో సీట్ షేరింగ్ పై విభేదాలు రావడంతో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖా మంత్రి పశుపతి పరాస్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రస్తుతం కేంద్ర ఎర్త్ స్పెన్సన్ మంత్రి కిరణ్ రిజిజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. రిజిజు ప్రస్తుతం ఉన్న ఫోర్ట్ పోలియోతో పాటు అదనంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు. ఇది తక్షణమే అమలులోకి రానునట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. కాగా, బిహార్‌లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జెపీ)కి సీట్ షేరింగ్ విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ..ఆ పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ మంగళవారం రాజీనామా చేశారు.

Tags:    

Similar News