పాక్ లోని హింగ్లాజ్ దేవిని దర్శించుకున్న లక్ష మంది హిందువులు

హింగ్లాజ్ యాత్రలో పాక్ లోని లక్ష మంది ముస్లింలు పాల్గొన్నారు. పాక్ లోని బలుచిస్తాన్ ప్రావిన్స్ లోని హింగోల్ నేషనల్ పార్కు సమీపంలో ఈఆలయం ఉంది.

Update: 2024-04-28 12:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హింగ్లాజ్ యాత్రలో పాక్ లోని లక్ష మంది ముస్లింలు పాల్గొన్నారు. పాక్ లోని బలుచిస్తాన్ ప్రావిన్స్ లోని హింగోల్ నేషనల్ పార్కు సమీపంలో ఈఆలయం ఉంది. అయితే, పాక్ దేశ జనాభాలో సుమారు 4 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. పాక్ జనాభాలో హిందువుల జనాభా 2.14 శాతం మాత్రమే. అయితే, శుక్రవారం ప్రారంభమైనా హింగ్లాజ్ యాత్రలో పాల్గొనేందుకు లక్షమందికి పైగా హిందువులు వచ్చారని అంచానా.

దేశ విభజన తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే అక్కడ ఉండిపోయారు. అయినా, ఇప్పటికీ పలు హిందూ ఆలయాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. వాటిలో హింగ్లాజ్‌ దేవి ఆలయం ఒకటి. హింగ్లాజ్‌ దేవిని ముస్లింలు బీబీ నానీగా పిలుస్తారు. పలువురు ముస్లింలు హింగ్లాజ్‌ దేవిని పూజిస్తారు కూడా. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ తూర్పు ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి మధ్యలో హింగ్లాజ్‌ దేవి ఆలయం ఉంది. కరాచీ నుంచి 250కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారానే ఆలయానికి చేరుకోవాలి. దేవాలయ పూజారి మహారాజ్ గోపాల్ హింగ్లాజ్ దేవి గురించి వివరించారు. ఇదో అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర అని అన్నారు. ఈ మూడ్రోజులు ఎవరైతే దేవిని పూజిస్తారో వారి పాపాలన్నీ తొలగిపోతాయని తెలిపారు.

ప్రతి ఏడాది ఏప్రిల్ లో మూడు రోజులపాటు హింగ్లాజ్ లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి శుక్రవారం ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం ముగియనున్నాయి. ఆ సమయంలో సాధువులు, హఠయోగులు హింగ్లాజ్‌ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక ముస్లింలు ఈ ఉత్సవాలను నానీకీ హజ్ అని పిలుస్తారు. హింగ్లాజ్‌ దేవి ఉత్సవాలు జరిగే సమయంలో భక్తులు పాదయాత్రగా వెళతారు. ఎందుకంటే ఎడారి ప్రాంతాన్ని తలపించే ఆ రహదారి గుండా వెళ్తే అక్కడ వీచే వేడి గాలులు శరీరాన్ని తాకి చేసిన పాపాలను పోగొడతాయని వారి నమ్మకం. ఆలయ సమీపానికి చేరుకున్న భక్తులు అక్కడ ప్రవహించే హింగ్లోజ్‌ నదిలో స్నానమాచరించి దేవిని దర్శించుకుంటారు.

హింగ్లాజ్‌ దేవిని దర్శించుకున్న తర్వాత భక్తులు అక్కడి సమీపంలో ఉన్న చంద్రగప్‌, కందేవారీ అనే బురదతో కూడిన అగ్నిపర్వతంపైకి వెళ్తారని తెలిపారు స్థానికులు. ఆ బురదలో పూలు చల్లి, తమ వెంట తెచ్చుకున్న కొబ్బరి కాయలను అందులో ముంచుతారని వివరించారు. బురద అంటిన ఆ కొబ్బరి కాయలను ఇంటిలో పెట్టుకుంటే శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకమని చెప్పుకొచ్చారు. కొందరు ఆ బురదను శరీరానికి పూసుకుంటారని తెలిపారు.

Similar News