ఢిల్లీలో శబ్ద కాలుష్య నియంత్రణకు ట్రాఫిక్ పోలీసుల చర్యలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రెషర్ హరన్లు, మాఢిపై చేసిన సైలెన్సర్లను వినియోగిస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు దిగారు.

Update: 2022-08-25 13:44 GMT

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రెషర్ హరన్లు, మాఢిపై చేసిన సైలెన్సర్లను వినియోగిస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు దిగారు. గత ఐదు రోజుల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 900కు పైగా జరిమానాలు విధించామని గురువారం అధికారులు వెల్లడించారు. హరన్లపై 583, మాడిఫై చేసిన సైలెన్సర్లపై 354 జరిమానాలు విధించినట్లు పేర్కొంది. గత శనివారమే శబ్ద కాలుష్య నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. ఇప్పటి వరకు శబ్ద కాలుష్యాన్ని కలిగించినందుకు 3,502 మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వీటీలో 1,331 హరన్, 2వేలకు పైగా సైలెన్సర్, 113 ప్లేయింగ్ మ్యూజిక్, 49 నో హరన్ జోన్ నిబంధనలు అతిక్రమించారని చెప్పారు. కాగా, శబ్దకాలుష్యంపై ప్రజల్లో అవగహనా కల్పించేందుకు డాక్టర్లచే రేడియో ద్వారా ప్రచారం చేస్తామని ట్రాఫిక్ అధికారి పేర్కొన్నారు.

Tags:    

Similar News