బీజేపీని గద్దె దించడమే మనందరి లక్ష్యం!.. పినరయ్ విజయన్ పునరాలోచించాలి.. కాంగ్రెస్ నేత శశిథరూర్

కేరళ సీఎం పినరయ్ విజయన్ రాహుల్ గాంధీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్ధి శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-23 13:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ సీఎం పినరయ్ విజయన్ రాహుల్ గాంధీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్ధి శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన పినరయ్ విజయన్ తమ మిత్ర పక్షానికి చెందిన నాయకుడిపై విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు. మేము, వారు కలిసి బీజేపీపై దాడి చేయాలని అనుకుంటామని కానీ, అందరూ కలిసి కాంగ్రెస్ పై దాడి చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపారు. వారు ప్రశాంతంగా ఉండి ఈ అంశంపై పునరాలోచించుకోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. అలాగే మా అందరి లక్ష్యం ఒక్కటేనని, ఢిల్లీలో బీజేపీని గద్దే దించడమేనని, దానిపైనే అందరూ దృష్టి సారించాలని సూచించారు.

కాగా కేరళలో మిత్ర పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ(మార్కిస్ట్) నాయకులైన రాహుల్ గాంధీ, పినరయ్ విజయన్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర సమయంలో సీఏఏ గురించి మాట్లాడలేదని, కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు ఒక్కటేనని, కేరళలో కమ్యూనిస్టులను గెలిపించాలని పినరయ్ విజయన్ మీడియా సమావేశంలో అన్నారు. దానిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. అందరి లాగే పినరయ్ కూడా కేసులకు బయపడి బీజేపీని విమర్శించడం లేదేమో అని అన్నారు. మళ్లీ రాహుల్ వ్యా్ఖ్యలపై పినరయ్ జైళ్ల గురించి భయపడటంపై రాహుల్ గాంధీ మాట్లాడవద్దని, ఆయన నానమ్మ ఒకటిన్నర సంవత్సరం మమ్మల్ని జైళ్లో పెట్టినా భయపడలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం పట్ల నాయకులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Similar News