ఆపరేషన్ అమృత్‌పాల్‌.. దేశవ్యాప్తంగా హై అలర్ట్..

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌ను అణిచివేసేందుకు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత ఆ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేశారు.

Update: 2023-03-23 06:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృత్‌పాల్‌సింగ్‌ను అణిచివేసేందుకు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత ఆ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేశారు. అలాగే మూడు రోజుల పాటు ఇంటర్నెట్ కూడా నిలిపివేయడం జరిగింది. కాగా మొదట అతను పట్టుబడ్డాడని చెప్పిన పోలీసులు.. తర్వాత పరారీలో ఉన్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా అమృత్‌పాల్‌ కోసం పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రబలగాలతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు.

కాగా ఈ నేపథ్యంలో భద్రతా సంస్థలు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు అమృత పాల్ కోసం నిరంతరం వెతుకుతూనే ఉన్నాయి. నేపాల్ సరిహద్దు నుంచి అనేక రాష్ట్రాల్లో ఆపరేషన్ అమృత్‌పాల్‌ను అమలు చేస్తున్నారు. అలాగే అమృత్‌పాల్‌ కోసం అన్వేషణకు సంబంధించి మహారాష్ట్రలో హెచ్చరిక జారీ చేశారు.

Tags:    

Similar News