ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ మార్పు.. ఏప్రిల్, మేలో కొత్త పుస్తకాలు

3వ తరగతికి ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతి విద్యార్థులకు మే మూడోవారంలో పుస్తకాలు విడుదల అవుతాయని తెలిపింది.

Update: 2024-04-04 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సిలబస్ మార్పు, కొత్త పాఠ్యపుస్తాకలకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. 3,6 తరగతులకు కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు విడుదల చేస్తామని, 3వ తరగతికి ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతి విద్యార్థులకు మే మూడోవారంలో పుస్తకాలు విడుదల అవుతాయని తెలిపింది. 4, 5, 9, 11వ త‌ర‌గ‌తుల‌కు స్టాక్ సిద్ధంగా ఉందని, అదేవిధంగా 1,2,7,8,10,12 తరగతులకు 2023-24 ఎడిషన్స్ పాఠ్య పుస్తకాలు 1.21 కోట్ల కాపీలు దేశవ్యాప్తంగా విడుదల చేసినట్టు పేర్కొంది. 6వ తరగతి విద్యార్థులకు అప్‌డేట్ చేసిన పాఠ్యాంశాలు బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ పోర్టల్‌లో 6వ తరగతికి బ్రిడ్జ్ కోర్సు అందుబాటులోకి ఉందని వెల్లడించింది. అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్‌ కాపీలు వెబ్‌సైట్‌తో పాటు దీస్ఖ, ఈ-పాఠశాల పోర్టల్‌, యాప్‌లలో ఉచితంగా లభిస్తాయని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News