MP Elections : ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

దేశంలోని 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.

Update: 2024-05-25 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. కాగా ఢిల్లీలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు వేశారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ఆయన సతీమణి ఓటు వేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రియాంకగాంధీ, ఆమె కుమార్తె, కుమారుడు ఢిల్లీలోనే ఓటు వేశారు. మాజీరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాంచీలో తెలంగాణ గవర్నర్ రాధాక్రిష్ణన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం కేజ్రీవాల్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఢిల్లీలో ఓటు వేశారు. భవనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Similar News