ప్రాణాల మీదికి తెచ్చిన డబ్బు వివాదం.. బిల్డింగ్ పై నుంచి తోసేసిన దుండగులు! (వీడియో వైరల్)

ప్రస్తుత సమాజంలో మనుషుల ప్రాణాల కన్నా డబ్బుకే విలువ ఎక్కవ అన్నట్లుగా తయ్యారయ్యింది.

Update: 2024-05-26 08:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుత సమాజంలో మనుషుల ప్రాణాల కన్నా డబ్బుకే విలువ ఎక్కవ అన్నట్లుగా తయ్యారయ్యింది. డబ్బు వివాదం కారణంగా ఓ వ్యక్తిని బిల్డింగ్ టెర్రస్ పై నుండి తోసేసిన అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. లక్నోలో డబ్బు వివాదంలో ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు కొందరు యువకులు ఓ ఇంటికి వచ్చారు. వారికి భయపడి ఆ వ్యక్తి ఇంటి టెర్రస్ ఎక్కాడు. వారిలో ముగ్గురు వ్యక్తులు అతన్ని వెంబడించి దారుణంగా కొట్టారు. అమనుషంగా టెర్రస్ మీద నుండి రోడ్డు పైకి తోసేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తిని కాలితో తన్ని మరి లేపారు.

ఇంతలో అటుగా వెళుతున్న ఓ వ్యక్తి వారిని వారించే ప్రయత్నం చేసిన వినకుండా ఆ వ్యక్తిపై తవ్రంగా దాడి చేశారు. ఈ సంఘటనను ఎదురింట్లో ఉండే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. యూపీ పోలీస్, లక్నో పోలీస్ లను ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన యూపీ పోలీస్ ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లక్నో పోలీసులను ఆదేశించింది. లక్నో పోలీసులు స్పందిస్తూ.. మాదేగంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.

దీనిపై వీడియో పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులలో అమిత్, గౌతమ్, అంకుర్ అనే ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డబ్బు కోసం ఏమైనా చేసేలా ఉన్నారు అని, సాటి మనిషి అని చూడకుండా అలా ఎలా ప్రవర్తిస్తారు అని కామెంట్లు పెడుతున్నారు.

Similar News