హిమాచల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మోడీ కుట్ర: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధనబలం ఉపయోగించి పడగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలా ప్రయత్నించారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు.

Update: 2024-05-27 10:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధనబలం ఉపయోగించి పడగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలా ప్రయత్నించారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రా లోక్‌సభ స్థానం అభ్యర్థి ఆనంద్ శర్మకు మద్దతుగా సోమవారం చంబాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 55 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ధనిక పార్టీగా మారలేక పోయింది, కానీ కేవలం పదేళ్లలోనే బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన పార్టీగా అవతరించిందని తెలిపారు.

దేశంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఉందని విమర్శించారు. అందుకే ధనబలంతో సహా అన్నింటినీ వాడుకుంటున్నారని చెప్పారు. దేవుడి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మతం పేరుతో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక అందమైన రాష్ట్రం, ఇక్కడి సంస్కృతి నిజాయితీకి పేరుగాంచినది. హిమాచల్ నుంచి దేశం ఎంతో నేర్చుకోవాలి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విపత్తు సమయంలో కాంగ్రెస్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరించిందని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. 

Tags:    

Similar News