నితిన్ గడ్కరీ ఓటమికి మోడీ, అమిత్ షా ప్రయత్నం: సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఓడించడానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ప్రయత్నించారని ఆరోపించారు.

Update: 2024-05-26 14:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఓడించడానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా కథనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నాగ్‌పూర్‌లో గడ్కరీ ఓటమికి మోడీ, షా ఫడ్నవీస్ పనిచేశారు. తనను ఓడించలేరని గ్రహించినప్పుడు ఫడ్నవీస్ ఇష్టం లేకుండానే గడ్కరీ కోసం ప్రచారంలో చేరారు. గడ్కరీని ఓడించడానికి విపక్షాలకు ఫడ్నవీస్ సహకరించారు. ఈ విషయం నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు బహిరంగంగా చెబుతున్నారు’ అని పేర్కొన్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రతి నియోజకవర్గంలో రూ. 25-30 కోట్లు పంపిణీ చేశారని, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థులను ఓడించేందుకు ఆయన యంత్రాంగం మొత్తం పని చేసిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని మారుస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే స్పందించారు. సంజయ్ రౌత్‌ను భ్రాంతి పరుడిగా అభివర్ణించారు. బీజేపీ ఒక పార్టీ కాదని, ఒక కుటుంబం లాంటిదని తెలిపారు. రాజకీయాలు మాత్రమే చేసే వ్యక్తులు కుటుంబ బంధాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని విమర్శించారు.

Tags:    

Similar News