గేమింగ్ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 24 కు చేరిన మృతుల సంఖ్య

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొదట 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మంటలను ఆర్పుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతుంది.

Update: 2024-05-25 15:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొదట 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మంటలను ఆర్పుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతుంది.సాయంత్రానికి ఈ ప్రమాదంలో చనిపోయిన 24 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు రాజ్‌కోట్ పోలీస్ కమీషనర్ రాజు భార్గవ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్‌పి గేమింగ్ జోన్‌లో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయి. వీలైనంత ఎక్కువ మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుతానికి, సుమారు 24 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో అత్యధికంగా విద్యార్థులు, చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. అలాగే మంటలు అదుపులోకి వస్తున్న క్రమంలో సజీవ దహనం అయిన వారి మృతదేహాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయని.. ప్రస్తుతానికి దొరికిన 24 మృతదేహాలతో పాటు మరికొంత మంది కూడా చనిపోయి ఉంటారని పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు.

Similar News