రైళ్లలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని దీదీ డిమాండ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని, టిక్కెట్ల డైనమిక్ల ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Update: 2023-11-19 11:26 GMT

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని, టిక్కెట్ల డైనమిక్ల ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మమతా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ప్రయాణికుల భద్రతకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలని, కొన్నిసార్లు రైలు ఛార్జీలు విమానా టికెట్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని విమర్శించారు. గత కొంతకాలం నుంచి రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీల భారం పెరుగుతోందని, సువిధ రైళ్లలో కొన్ని సందర్భాల్లో విమాన టికెట్ కంటే ఎక్కువ ఉండటం విచారకరన్నారు. అంతంత ఛార్జీలు ఉంటే అత్యవసర సమయాల్లో సామాన్యులు రైళ్లలో ఎలా ప్రయణించగలదరని ప్రశ్నించారు.

'ఛార్జీల పెంపును అరికట్టాలి, భద్రతా సమస్యలపై శ్రద్ధ పెట్టాలని ' ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, దేశంలో పెరుగుతున్న రైలు ప్రమాదాల సంఖ్య గురించిన ప్రస్తావించిన మమతా బెనర్జీ, తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రమాదాల నిరోధక పరికరాలు, ఇతర చర్యలను ఎందుకు ఉపయోగించడంలేదని ప్రశ్నించారు. ప్రజలకు భారమయ్యే ఛార్జీలను అదుపు చేయకుండా, పెరుగుతున్న రైలు ప్రమాదాలను నివారించడానికి ఎందుకు ప్రయత్నం చేయడంలేదని సందేహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News