కేజ్రీవాల్‌కు బెయిల్‌ రావడంపై మమతా బెనర్జీ, ఇండియా కూటమి రియాక్ట్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది

Update: 2024-05-10 10:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కేజ్రీవాల్‌కు బెయిల్ రావడాన్ని స్వాగతించింది. అలాగే, తృణమూల్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ మమతా బెనర్జీ ఎక్స్‌‌లో స్పందిస్తూ, అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత ఎన్నికల సందర్భంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

కోర్టు ఉత్తర్వుల ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రికి న్యాయం, ఉపశమనం కలిగింది, ఇది గొప్ప మార్పుకు సంకేతం, ఆయన నిజం మాట్లాడుతుంటాడు, కానీ అది బీజేపీకి ఇష్టం ఉండదు. మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి ఇండియా కూటమి మరింత శక్తిగా తయారవుతుందని శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య ఠాక్రే ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో రాశారు. కేజ్రీవాల్‌కు ఉపశమనం కలిగించే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పార్టీ స్వాగతిస్తున్నదని, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కూడా అదే విధమైన ఉపశమనం లభిస్తుందని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News