లోక్‌సభ బరిలో దీదీ మేనల్లుడు.. ఎక్కడి నుంచి నామినేషన్ వేశాడంటే..

లోక్ సభ ఎన్నికల బరిలో బెంగాల్ సీఎం మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నిలిచారు. డైమండ్ హార్బర్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

Update: 2024-05-10 15:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల బరిలో బెంగాల్ సీఎం మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నిలిచారు. బెంగాల్ లోని సౌత్ 24 పగణాస్ జిల్లాలోని డైమండ్ హార్బర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఆస్థానానికి నామినేషన్ కూడా దాఖలు చేశారు.

అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. నామినేషన్ దాఖలు చేయడానికి అభిషేక్ కాళీఘాట్ నుంచి నడిచి.. అలీపూర్‌లోని జిల్లా కలెక్టర్ ఆఫీసులో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

నామినేషన్ దాఖలు చేసిన తరువాత తృణమూల్‌ కాంగ్రెస్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి 'అభిషేక్‌ బెనర్జీ' మాట్లాడుతూ.. డైమండ్‌ హార్బర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. తానో జోతిష్కుడ్ని కాదని.. భవిష్యత్ ని అంచనావేయలేను కానీ.. ప్రజలకు సేవ చేయడంలో ఏ అవకాశాన్ని వదిలిపెట్టనని అన్నారు. గతసాకి కంటే ఈసారి మెజార్టీ ఎక్కువగా పెరుగుతుందని దీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా పనిచేసినట్లుగా.. ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు తమపై ఉంటాయని ఆశాభావంతో ఉన్నామన్నారు.

బెంగాల్ లోని 42 స్థానాలకు ఏడుదశల్లో పోలింగ్ జరగుతోంది. బెంగాల్ లోని ఆరు లోక్ సభ స్థానాలకు తొలి మూడు దశల్లో పోలింగ్ జరగగా.. మిగతా స్థానాలకు తరువాతి దశల్లో ఓటింగ్ జరగనుంది. జాన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.

2014 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ లో టీఎంసీ 34 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీపీఐ (ఎం) 2 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇక 2019లో మాత్రం టీఎంసీకి కేవలం 22 స్థానాల్లోనే గెలిచింది. బీజేపీ అనూహ్యంగా 18 సీట్లు గెలుపొందింది. కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు గెలుచుకోగా.. వామపక్షాలు ఒక్కచోట కూడా గెలవలేకపోయాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News