ఉద్యోగులను కలవరపెడుతోన్న లేఆఫ్స్..!

ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఉద్యోగులను ఉన్నట్టుండి విధుల నుంచి తొలగిస్తున్నాయి.

Update: 2024-05-22 08:54 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఉద్యోగులను ఉన్నట్టుండి విధుల నుంచి తొలగిస్తున్నాయి. గతంలో అమెజాన్ 18 వేల మందిని పీకేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇండియాలో మరోసారి లేఆఫ్స్ వేవ్ మొదలైందని సమాచారం. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. నైపుణ్యాలతో సంబంధం లేకుండా లేఆఫ్స్ ప్రకటిస్తూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ కంపెనీలో ఏకంగా 300 మందిని తొలగించగా..ఓ MNC లోనూ వందల మంది లేఆఫ్‌కి బలైనట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ అప్‌గ్రేడ్ కావాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.

Similar News