తుఫాను నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ క్లోజ్.. పలు రైళ్లు క్యాన్సల్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 'రెమల్' తీవ్ర తుఫానుగా బలపడి ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య గంటకు 135 కి.మీ వేగంతో తీరం దాటనుంది

Update: 2024-05-26 04:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 'రెమల్' తీవ్ర తుఫానుగా బలపడి ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య గంటకు 135 కి.మీ వేగంతో తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌ను దాదాపు 21 గంటల పాలు క్లోజ్ చేయనున్నారు. అలాగే పలు రైళ్లను సైతం క్యాన్సల్ చేశారు. కోల్‌కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్, హౌరా, హుగ్లీ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు.

ఉత్తర ఒడిశా, బెంగాల్‌లో కొన్ని జిల్లాల్లో సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు అవస్థలు పడనున్నారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సగటున దాదాపు 300 కంటే ఎక్కువ విమానాలను నడుపుతారు, ఇప్పుడు తుఫాను ప్రభావంతో వీటి ప్రయాణాలు నిలిచిపోనున్నాయి. వాతావరణ శాఖ తన బులెటిన్‌లో, ప్రజలు ఇంట్లోనే ఉండాలని, బయటికి వెళ్లకుండా ఉండాలని సూచించింది. తుఫానును ఎదుర్కొనేందుకు తమ బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News