స్విగ్గీ, జొమాటోపై కేరళ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

ఓ యువకుడి కేసులో వాదనలు వింటున్న కేరళ హైకోర్ట్ జడ్జీ ఇంటి వంట గురించిన ప్రాముఖ్యతను వెల్లడించారు.

Update: 2023-09-13 04:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఓ యువకుడి కేసులో వాదనలు వింటున్న కేరళ హైకోర్ట్ జడ్జీ ఇంటి వంట గురించిన ప్రాముఖ్యతను వెల్లడించారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఆహారాన్ని పిల్లలకు పెట్టకూడదని, ఆ విషయంలో తల్లిదండ్రులకు నియంత్రణ ఉండాలన్నారు. అదేవిధంగా మొబైల్ యాప్‌ల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే బదులు బలవర్ధకమైన ఆహారాన్ని పిల్లలకు ఇంట్లోనే తయారు చేసి పెట్టే బాధ్యత తల్లిపై ఉంటున్నారు. పిల్లలను ఎప్పుడూ చదువు అని విసిగించకుండా, ఇంట్లోనే బంధిలుగా చేయకూడదని, వారిని ఆరుబయట కూడా ఆడుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇంట్లో రుచికరమైన ఆహారాన్ని పిల్లలు తినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జస్టిస్ పీ.వీ కున్హికృష్ణన్ తన తీర్పులో సూచించారు.

Tags:    

Similar News