కర్నాటక రిజల్ట్స్: కాంగ్రెస్‌కు షాక్.. సోనియా గాంధీ ప్రచారం చేసిన చోట హస్తం ఓటమి

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్‌ పార్టీకి హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్‌లో భారీ ఎదురు దెబ్బ తగిలింది.

Update: 2023-05-13 07:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్‌ పార్టీకి హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్‌లో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టార్ బీజేపీ అభ్యర్థితో చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టార్ తరుఫున కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రచారం చేసినప్పటికీ హుబ్బళిలో కాంగ్రెస్ ఓటమి పాలవ్వడం గమనార్హం.

ఇక, కర్నాటక బీజేపీలో సీనియర్ నేత, మాజీ సీఎం అయిన జగదీష్ షెట్టార్ ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో చివర్లో హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ ఆయనను హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్‌ నుండి బరిలోకి దింపింది. ఆయన గెలుపు కోసం స్వయంగా సోనియా గాంధీ ప్రచారం చేసినటప్పటికీ ఇక్కడ హస్తం ఓడిపోవటం గమనార్హం. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ అధిక్యం దిశగా దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటి భారీ మెజార్టీ దిశగా వెళ్తుంది. 

Also Read...

కర్ణాటక రిజల్ట్స్ : ఇప్పటి వరకు ఆయా పార్టీలకు పోలైన ఓట్ల శాతం ఇదే..!

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News