Jacqueline Fernandez కు స్వల్ప ఊరట

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. శనివారం ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో ఆమెకు మధ్యంతర బెయిల్‌ను పొడగించింది.

Update: 2022-10-22 13:15 GMT

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. శనివారం ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో ఆమెకు మధ్యంతర బెయిల్‌ను పొడగించింది. వచ్చే నెల 10 వరకు బెయిల్ పొడగిస్తూ, విచారణ కూడా అదే తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా ఈడీ అందరికీ సంబంధించిన ఛార్జ్ షీటుతో పాటు ఇతర డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశించింది. ఆగస్టు 17న ఈడీ జాక్వెలిన్ పై చార్జ్ షీటు దాఖలు చేసింది. చంద్రశేఖర్ నుంచి రూ.7 కోట్ల విలువ చేసే ఖరీదైన బహుమతులను తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే దేశం విడిచి వెళ్లకుండా ఆమెపై ల్యూక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు జైలులో ఉన్న కన్మన్ సుఖేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఎలాంటి సంబంధం లేదని తన లాయర్‌కు లేఖ రాశారు. తనతో స్నేహంలో భాగంగానే బహుమతులు ఇచ్చానని చెప్పారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో కన్మాన్ చంద్రశేఖర్ అరెస్టైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి:

పిల్లల ముందు రొమాన్స్ చేయను: Sunny Leone (సన్నీ లియోన్) 

Tags:    

Similar News