చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్‌.. ఆ ఇద్దరికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పెషల్ విషెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైంది. చంద్రయాన్- 3 చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపడంతో దేశ వ్యాప్తంగా సంబురాలు

Update: 2023-08-23 14:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైంది. చంద్రయాన్- 3 చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపడంతో దేశ వ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధృవం పైకి చేరుకోవడంతో ప్రపంచదేశాల నుండి భారత్‌కు, ఇస్రోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోడీకి, ప్రతి ఒక్కరికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధన్యవాదాలు తెలిపారు.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారని చెప్పారు. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు గర్వంగా ఉందని సోమనాథ్ పేర్కొన్నారు. ప్రయోగం సక్సెస్ కావడం కోసం కొన్ని రోజులుగా ప్రార్థించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్లు, కిరణ్ కుమార్, కమలాకర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చంద్రయాన్- 3 సక్సెస్‌తో సీనియర్లు శాస్త్రవేత్తలో మరింత విశ్వాసం కల్పించారన్నారు. చంద్రయాన్-1 నుంచి ప్రస్థానం కొనసాగుతుందని.. చంద్రయాన్-2 ఇప్పటికీ పని చేస్తుందని తెలిపారు.

Read More..

ఇస్రో చీఫ్ సోమనాధ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ (వీడియో)  

చంద్రయాన్ -3 గ్రాండ్ సక్సెస్.. ఇస్రోకు నాసా అభినందనలు..! 

చంద్రుడిపై ల్యాండ్ అయిన చంద్రయాన్-3.. తర్వాత ఏమి చేయనుందంటే..?  

 

Tags:    

Similar News