Himachal Pradesh లో ఓటమిపై వారి మీద చర్యలు తప్పవు: బీజేపీ చీఫ్

హిమాచల్ ప్రదేశ్‌లో ఓటమిపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-09 10:18 GMT

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో ఓటమిపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ట్రెండ్స్‌కు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు. తాజాగా నిర్వహించిన ఆజ్ తక్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'రెబల్ లీడర్‌ను వెనకేసుకుంటే తప్పుడు వ్యవస్థగా పరిగణిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండి బాధ్యతగా నడుచుకుంటే, భవిష్యత్తు బాగానే జరుగుతుంది' అని చెప్పారు.

గతంలో ఎన్నికల్లో గెలిచిన, రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ఓట్ల వ్యత్యాసం 6 శాతం ఉంటే ప్రస్తుతం ఒక శాతం లోపే ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు అంకెలు, పరిస్థితుల మధ్య గేమ్ అని అన్నారు. పార్టీని ఇబ్బందులకు గురి చేసే నేతల విషయంలో సమాధానం తీసుకుంటామని చెప్పారు. గుజరాత్ ప్రజలను మాయ చేయాలని కేజ్రీవాల్ చూశారని ఆరోపించారు. ఏబీ రిపోర్టు పేరుతో ప్రలోభ పెట్టాలని చూసిన ఫలించలేదని అన్నారు. అనేక చోట్ల ఆప్ డిపాజిట్లు కోల్పోయిందని పేర్కొన్నారు.

Also Read....

ఆ వివరాలను బహిర్గతం చేయలేం: సుప్రీంకోర్టు

Tags:    

Similar News