మోడీని తిట్టడమే ‘ఇండియా’ పని: ప్రధాని మోడీ విమర్శలు

భారత్‌ను అన్ని రంగాల్లో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు దేశం కోసం 24x7 పని చేసే మోడీకి, పని లేని ఇండియా కూటమికి మధ్య జరుగుతున్నాయన్నారు.

Update: 2024-05-25 07:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌ను అన్ని రంగాల్లో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు దేశం కోసం 24x7 పని చేసే మోడీకి, పని లేని ఇండియా కూటమికి మధ్య జరుగుతున్నాయన్నారు. బిహార్‌లోని పాటలీపుత్రలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. ఇండియా కూటమి రాత్రి పగలు మోడీని దుర్భాషలాడడంలో బిజీగా ఉందని ఆరోపించారు. ‘2024 ఎన్నికల్లో ఒకవైపు 24 గంటలు కష్టపడుతున్న మోడీ, మరోవైపు అబద్ధాలు చెప్పే ఇండియా కూటమి ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చడంలో మోడీ బిజీగా ఉన్నారు. కానీ మోడీని దుర్భాషలాడంలో ఇండియా కూటమి నేతలు బిజీగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పైనా మోడీ విమర్శలు గుప్పించారు. ఎల్‌ఈడీ బల్బుల కాలంలో బిహార్‌లో లాంతరు కూడా ఉండేదని తెలిపారు. లాంతర్ ఒక ఇంటిని మాత్రమే వెలిగిస్తుందని, కానీ బిహార్ మొత్తం ప్రస్తుతం చీకట్లోనే ఉందని ఆరోపించారు. లాంతరు వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రపంచం ముందు తన అభిప్రాయాలను బలంగా అందించగల ప్రధాని భారతదేశానికి అవసరమని నొక్కి చెప్పారు. ఇండియా కూటమి 24 గంటలు అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు. వారు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను చూడాల్సి వస్తుందని ఆరోపించారు.

Tags:    

Similar News