భారతీయులు చైనా, ఆఫ్రికా, అరబ్బులా కనిస్తారు.. కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Update: 2024-05-08 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశంలో వైవిధ్యం గురించి ఓ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మనం ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ.. తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు, పశ్చిమంలో ప్రజలు అరబ్‌లా కనిపిస్తారు. ఉత్తరాది ప్రజలు తెల్లవారిలా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లా కనిపిస్తారంటూ వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. గత నెలలో, సంపద పునర్విభజనపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పిట్రోడా వారసత్వపు పన్నుకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. అలాగే ప్రధాన సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. కాగా ప్రస్తుతం దేశంలోని ప్రజలు భారతీయులు చైనా, ఆఫ్రికా, అరబ్బులా కనిపిస్తారని అనడంతో.. ఇవి కాంగ్రెస్ నేత జాత్యహంకార వ్యాఖ్యలని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Similar News