శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రతిష్ఠ.. భారత్ నుంచి సరయు నది నీరు..!

శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్నాయి. అందుకోసం పవిత్ర సరయు నది నీటిని శ్రీలంకకు పంపే ప్రక్రియను ప్రారంభించింది.

Update: 2024-04-28 14:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్నాయి. అందుకోసం పవిత్ర సరయు నది నీటిని శ్రీలంకకు పంపే ప్రక్రియను ప్రారంభించింది భారత్. మే 19న సీతమ్మవారి ఆలయ ప్రతిష్ఠాపన జరగనుంది. మతపరమైన కార్యక్రమాల కోసం సరయు నది నీటిని పంపాలని శ్రీలంక ప్రతినిధులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పవిత్ర జలాన్ని పంపే బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించారు.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించాల్సిన బాధ్యతను అయోధ్య రామాలయ ట్రస్ట్ ప్రశంసించింది. ఇకపోతే, శ్రీలంకలో సీత అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సరయు నది నీటిని యూపీ ప్రభుత్వం నుంచి ఇవ్వాలని ఆలయ ప్రతినిధి కోరారు. అయితే, కలశంలో పవిత్ర జలాన్ని అందిస్తామని.. మే 19న ప్రతిష్ఠాపన జరగనున్నట్లు తెలిపారు అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ సీఈవో సంతోష్ కుమార్ శర్మ.

సీతమ్మ ఆలయంలో జరిగే వేడుక భారతదేశం, శ్రీలంక మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధానికి బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇదిలా ఉండగా, శ్రీలంకలోని సీత అమ్మ దేవాలయం 'సనాతానీ'లందరికీ గర్వకారణంగా ఉంటుందని శ్రీలంక ప్రతినిధి మహంత్ శశికాంత్ దాస్. ప్రధాని మోడీ ప్రయత్నాలను కొనియాడారు. ఇది సనాతనీయులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. లంకలో సీతాదేవి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని.. ప్రస్తుతం అదే లంకలో మహాదేవాలయాన్ని నిర్మిస్తున్నామని అన్నారు.

Similar News